కమ్మని కూరగాయల తోట!

కమ్మని కూరగాయల తోట!
ఇంటి పంట 09 -04 -2011

ఆసక్తి ఉంటే మేడ మీదైనా చక్కగా కావాల్సినన్ని ఆకుకూరలు, కూరగాయలు ఆరోగ్యదాయకమైన రీతిలో పెంచుకోవడానికి పెద్దగా ప్రయాసపడాల్సిన అవసరం లేదని విజయవాడలో నివసిస్తున్న రావూరి సాదిక్ (98496 32813), శేషారత్నం దంపతులు సంతోషంగా చెపుతున్నారు. బెంజి సర్కిల్‌లోని వాసవ్య నర్సింగ్ హోమ్‌లో ఎక్స్‌రే లాబ్ ఇన్‌చార్జిగా పనిచేస్తున్న సాదిక్ పటమటలోని అశోక్‌నగర్‌లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.

కూరగాయలు తానే పండించుకునేందుకు 2006 మార్చిలో శ్రీకారం చుట్టారు. టెరస్ ్రమీద దాదాపు 750 చదరపు గజాల స్థలంలో వారు పర్మినెంట్‌గా సిమెంట్‌తో పొడవాటి తొట్లు కట్టించారు. 20 అడుగుల పొడవున రెండు తొట్లు కట్టారు. తీగ జాతి కూరగాయల సాగు కోసం ప్రత్యేకంగా ఇనుప రాడ్లతో పక్కాగా పందిరి కూడా వేయించారు.

ఫలితాలు ఉత్సాహపూరితంగా ఉండడంతో ఎల్ షేప్‌లో మరో తొట్టి కట్టించారు. డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేశారు. ఎక్కువైన నీరు తొట్ల కింద నుంచి బయటకు పోయేలా రంధ్రాలు ఏర్పాటు చేశారు. రకరకాల ఆకుకూరలు, కూరగాయలు ఏడాదిపొడవునా పండించుకుంటూ ఆరోగ్యదాయకమైన ఆహారం తాము తినడమే కాకుండా బంధుమిత్రులకు పంచుతున్నారు. ఎటువంటి చీడపీడలు మొక్కల దరిచేరడం లేదని, విష రసాయనాలు వాడాల్సిన అవసరమే రావడం లేదంటున్నారు సాదిక్. సిటీ ఫార్మింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఆయన మాటల్లోనే..

మేడపైనే 11 నెలలూ పండిస్తాం


ఆసక్తి ఉండి.. తొలుత కొద్దిగా పెట్టుబడి పెడితే.. తదనంతరం రుచికరమైన కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవచ్చు. మేలో తప్ప ఏడాదికి 11 నెలలు మాకు కూరగాయలు కొనాల్సిన అవసరం ఉండదు. ఆకుకూరలైతే బెజ వాడ మే ఎండలను కూడా తట్టుకుంటాయి. మొక్కలంటే మా ఆవిడతోపాటు పిల్లలకూ చాలా ఇష్టం. మేడ మీద నేరు గా మట్టి పోసి మొక్కలు పెంచుతుంటే.. టెరస్ ్రశ్లాబ్ దెబ్బతింటుందేమోనని.. కొంచెం ఎత్తులో సిమెంటు తొట్లు కట్టిం చాను. తొట్టెలను ఒకటిన్నర అడుగుల లోతున.. అడుగుకు పైగా వెడల్పుతో కట్టించాను. మొదట సారవంతమైన నల్లమట్టితో నింపి మొక్కలు పెంచడం ప్రారంభించాం. తర్వాత వారానికో, పది రోజులకు ఒకసారి మొక్కకు గుప్పెడు వర్మీ కంపోస్ట్ వేస్తున్నాం. ఆరేళ్లయినా ఆ మట్టి మార్చలేదు. టమాటా, వంగ, పాలకూర, తోటకూర చక్కగా రావడం తో.. బెండ, పచ్చిమిర్చి, గోంగూర, బచ్చలి కూర, పుదీనా వేశాం. మొక్కల ఎదుగుదల మందగించిందనిపించినప్పు డు కొద్దిగా యూరియా వేస్తున్నాం. అప్పుడప్పుడు గండు చీమలు కనిపిస్తుంటే.. గమాక్సిన్ చల్లుతున్నాం. అంతకు మించి చీడపీడల బాధ లేనే లేదు. పైపులకు బెజ్జాలుపెట్టి ట్యాంక్‌కు వాల్వ్ బిగించాం.

సాయంత్రం పూట పావుగంటలో మొక్కలకు నీరుపెడుతున్నాం. మరీ వడగాడ్పులున్నప్పుడు మధ్యాహ్నం 3 గంటలప్పుడు నీరు మొక్కలపై స్ప్రే చేస్తుంటాం. అలవాటైపోవడం వల్ల మాకు ఈ పని ప్రయాస అనిపించడం లేదు. బంగాళదుంపలు, క్యాబేజీ తప్ప మరేం కొనడం లేదు. ఇంత పెద్దమొత్తంలో కాకపోయినా.. రెండేసి చొప్పున వంగ, టమాటా, బీర, పచ్చిమిర్చి, మూడు, నాలుగు రకాల ఆకుకూరలు పెట్టుకుంటే చిన్న కుంటుంబం మేడ మీద స్థలంలోనే తమకు తామే చక్కగా పండించుకోవచ్చు. రెండు మొక్కలే కదా అనుకోకండి.. కిలోలకు కిలోలు కాస్తాయి.

ఉదయం నుంచి సాయంత్రం వరకూ లాబ్‌లో నాలుగ్గోడల మధ్య కూర్చొనే ఉంటాను. అక్కడి నుంచి మేడపైన ఉన్న కిచెన్ గార్డెన్‌లోకి అడుగుపెట్టగానే.. ఆ విసుగంతా పోయి.. చాలా రిలీఫ్‌గా ఉంటుంది. చిన్నప్పుడు తిన్న రుచికరమైన కూరగాయలు ఇప్పుడూ పండించుకుంటున్నాం. మా తోటలో అప్పుడప్పుడూ మిత్రులందరం కూర్చొని హాయిగా మాట్లాడుకుంటుంటాం.. అంతకన్నా ఇంకేం కావాలి..?


నేడే నాగార్జున నగర్‌లో ‘ఇంటి పంట’ వర్క్‌షాప్
ఎల్లారెడ్డిగూడ (పంజాగుట్ట నుంచి శ్రీనగర్ కాలనీ వెళ్లే రోడ్డు)లోని నాగార్జుననగర్ సంక్షేమ సంఘం హాలు(9492046650)లో ఈ నెల 9 శనివారం సాయంత్రం (4 గంటల నుంచి 7 గంటల మధ్యలో) ఇంటి పంట వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ‘సాక్షి’, నాగార్జున నగర్ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ వర్క్‌షాప్‌లో మీరూ పాల్గొనవచ్చు. ప్రవేశం ఉచితం.

intipanta@googlegroups.com
‘ఇంటిపంట’ పాఠకులు నిపుణులను సంప్రదించడం కోసం, తమ అనుభవాలను పంచుకోవడం కోసం గూగుల్‌గ్రూప్స్.కామ్‌ను వినియోగించుకోవచ్చు. intipanta@googlegroups.com కు మెయిల్ పంపితే చాలు ఈ గ్రూప్‌లో సభ్యులు కావచ్చు. ఈ మెయిల్ ఐడీకి సభ్యుల్లో ఎవరు ఎవరికి మెయిల్ ఇచ్చినా.. దాని కాపీ ఆటోమేటిక్‌గా అందరికీ వస్తుంది.

‘ఇంటి పంట’ నిపుణులను సంప్రదించవచ్చు..

ఇంటి పంటల సాగుపై సందేహాలకు సమాధానాలివ్వడానికి నిపుణులు నిత్యం అందుబాటులో ఉంటారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం (తార్నాక, సికిం ద్రాబాద్): 040- 27014302 / 27017735 (అన్ని పనిదినాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకూ).
అగ్రి. హార్టీకల్చరల్ సొసైటీ అధ్యక్షులు మిద్దెల అనంతరెడ్డి: 92461 08262 (ఏరోజైనా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకూ). సీనియర్ సిటీ ఫార్మర్ వేగేశ్న రామరాజు: 040- 2371 6633, 94401 92377 (సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య ఏ రోజైన